SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎంజీఎం ఆసుపత్రి

Chennai MGM Hospital released health bulletin of SP Balasubrahmanyam
  • కరోనా కారణంగా విషమించిన బాలు పరిస్థితి
  • ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
  • ఎక్మో సపోర్టు కొనసాగుతోందన్న ఆసుపత్రి వర్గాలు

తెలుగుజాతి గర్వించదగ్గ సినీ గాయకుల్లో ఒకడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ సోకడంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. కొన్నిరోజుల కిందట ఎస్పీ బాలు పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. కొన్నిరోజుల కిందటే ఆయనకు ఎక్మో సపోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. అయితే, ఆయనకు ఐసీయూలో ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వివరించింది. ఆయనను తమ డాక్టర్ల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఈ బులెటిన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News