Subramanian Swamy: మోదీ సర్కారు నీట్, జేఈఈ పరీక్షలు జరిపితే అది పెను తప్పిదం అవుతుంది: సుబ్రహ్మణ్యస్వామి

  • సెప్టెంబరులో నీట్, జేఈఈ
  • 1976లో 'నస్బందీ' నిర్ణయం ఇలాంటిదేనన్న స్వామి
  • ఇందిరా సర్కారు పతనానికి కారణమైందని వెల్లడి
Subramanian Swamy says NEET and JEE imposing will be a big mistake

జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ నిర్వహణకు మోదీ సర్కారు సిద్ధమవుతుండడం ఈ సమయంలో పెను తప్పిదం అవుతుందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. 1976లో 'నస్బందీ'(నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు) నిర్ణయం తీసుకున్నారని, ఆ తీవ్ర తప్పిదమే 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పతనానికి దారితీసిందని వెల్లడించారు.

భారత ఓటర్లు లోలోన వేదన అనుభవిస్తుంటారని, కానీ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. జాతీయ పరీక్షల కేంద్రం (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్టీయే) ఇప్పటికే నీట్, జేఈఈ నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ (మెయిన్), నీట్ సెప్టెంబరు 13న జరగనున్నాయి.

More Telugu News