SP Charan: మా నాన్నకు నెగెటివ్ వచ్చిందంటూ పుకార్లు వ్యాప్తి చేయొద్దు: ఎస్పీ చరణ్ విజ్ఞప్తి

SP Charan condemns rumors that his father SP Balasubrahmanyam tested corona negetive
  • ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ అంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో నిజంలేదన్న బాలు తనయుడు ఎస్పీ చరణ్
  • తండ్రి హెల్త్ గురించి డాక్టర్లు ముందు తనకే చెబుతారని వెల్లడి
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందంటూ ఈ ఉదయం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రముఖంగా ప్రచారం జరిగింది. దాంతో ఆయన అభిమానులందరూ ఎంతో ఉపశమనం పొందారు. అయితే, ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ, తన తండ్రికి కరోనా నెగెటివ్ వచ్చిందంటూ పుకార్లు వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్ డేట్ ను ఎంజీఎం ఆసుపత్రి వాళ్లు తొలుత తనకే చెబుతారని, నెగెటివ్, పాజిటివ్ ల సంగతి ఏమో కానీ, ఆయన ఇంకా ఎక్మో సపోర్ట్ తో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. తన తండ్రి ఊపిరితిత్తులు త్వరలోనే పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
SP Charan
SP Balsubrahmanyam
Corona Virus
Negetive
Rumors
MGM Hospital
Chennai

More Telugu News