Chiranjeevi: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చిరంజీవి, బాబీ సినిమా?

Mythri Movie Makers to produce Chiranjeevi next film
  • 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు 
  • కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మెగాస్టార్
  • మరో నిర్మాతను కూడా భాగస్వామ్యం చేసేలా యోచన
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఒకదాని తర్వాత మరొక చిత్రాన్ని సెట్స్ కి తీసుకువెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం సెట్స్ కి వెళ్లడానికి ఎక్కువ ఆస్కారం వుంది. ఇప్పటికే బాబీ రూపొందించిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో పూర్తి స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దే పనిలో దర్శకుడు బాబీ వున్నాడు.

మరోపక్క ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మించడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకు ఈ సంస్థను బాబీ బాగా సిఫార్సు చేస్తున్నాడట. అయితే, ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు మరో నిర్మాతను కూడా భాగస్వామ్యం చేసేలా చిరంజీవి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నిర్మాతల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.  
Chiranjeevi
Bobby
Acharya
Mythri Movie Makers

More Telugu News