Amitabh Bachchan: కరోనా నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేసిన బిగ్ బీ

amitab shares a photo
  • ఇటీవలే డిశ్చార్జ్ అయిన బిగ్‌ బీ
  • కౌన్‌ బనేగా కరోర్‌పతి 12వ సీజన్‌ షూటింగ్‌లో అమితాబ్
  • పీపీఈ కిట్లు ధరించిన ప్రొడక్షన్ యూనిట్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'కౌన్‌ బనేగా కరోర్‌పతి' 12వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొన్నానని ఆయన చెప్పారు.

షూటింగ్ సందర్భంగా అక్కడి సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి ఉండడం ఇందులో కనపడుతోంది. బ్యాక్‌ టు వర్క్‌.. కేబీసీ 12వ సీజన్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ పీపీఈ కిట్లు ధరించి షూటింగ్‌లో పాల్గొంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది శుభపరిణామమని, కేబీసీ ప్రారంభమై ఈ ఏడాదితో 20 ఏళ్లు గడుస్తున్నాయని చెప్పారు.
Amitabh Bachchan
Bollywood
kbc

More Telugu News