Rahul Gandhi: రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆజాద్, కపిల్ సిబల్ ఆగ్రహం

azad and sibal fire on rahul gandhi
  • బీజేపీ ఏజెంటు‌లం కాదు 
  • వెంటనే రాజీనామా చేస్తా
  • సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేదు
  • అందుకే లేఖ రాశాం
కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో వాడీవేడీగా చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. 23 మంది సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్‌ , కపిల్ సిబాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు. 

 తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ లో  రాహుల్ గాంధీని ప్రశ్నించారు.  రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను కాపాడామని, మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను రక్షించామని, తాను  30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు.
Rahul Gandhi
Congress
cwc

More Telugu News