Vijay Sai Reddy: చంద్రబాబూ, నేరుగా అడుగుతున్నా... ఆ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?: విజయసాయి

YCP MP Vijayasai Reddy once again slams Chandrababu
  • డాక్టర్ రమేశ్ బాబు కోసం పోలీసుల గాలింపు
  • రమేశ్ ను మీ ఇంట్లో దాచారా? అంటూ బాబును ప్రశ్నించిన విజయసాయి
  • లేక లోకేశ్ ఇంట్లో దాచారా? అంటూ ట్వీట్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. తాజాగా, విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ అధినేత రమేశ్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలోనూ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కొన్ని విమర్శలు చేశారు. "చంద్రబాబూ నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేశ్ ను మీ నివాసంలో దాచారా? లేక, మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేశ్, డాక్టర్ రమేశ్ ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?" అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Dr Ramesh Babu
Ramesh Hospitals
Vijayawada

More Telugu News