ఢిల్లీ నుంచి లండన్‌కు బస్.. టికెట్ ధర రూ. 15 లక్షలు మాత్రమే!
- ‘బస్ టు లండన్’ పేరుతో గురుగ్రామ్ ట్రావెల్ సంస్థ సాహస యాత్ర
- 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు ప్రయాణం
- వీసా నుంచి అన్నీ చూసుకోనున్న ట్రావెల్ సంస్థ
యాత్రలో భాగంగా మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ప్రయాణం సాగుతుంది. 20 మంది మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, సహాయకుడు ఉంటారు. ఈ బస్సులో ప్రయాణించాలనుకునే వారికి వీసా, భోజన, వసతి సదుపాయాల నుంచి అన్నింటినీ ట్రావెల్ సంస్థే చూసుకుంటుంది. నిజానికి ఈ ఏడాది మే 21నే ప్రయాణం ప్రారంభించాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది.