అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన జపాన్ ప్రధాని.. ఏడున్నర గంటలపాటు పరీక్షలు
- సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చారన్న వైద్యులు
- ఆరోగ్యం బాగానే ఉందన్న ఆర్థిక మంత్రి
- పదవి నుంచి వైదొలగితే ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు
కాగా, ప్రధాని సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్థిక మంత్రి కట్సునోబు కటో తెలిపారు. ప్రధాని పదవి నుంచి షింజో వైదొలగితే ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని కనుక రాజీనామా చేయాలనుకుంటే ఎన్నికలు ముగిసి మరొకరు ప్రధాని అయ్యే వరకు షింజోనే ఆ పదవిలో కొనసాగుతారని సమాచారం.