బాలుడ్ని అపహరించి కోటి రూపాయల డిమాండ్.. రెండుగంట్లోనే కిడ్నాపర్ ను పట్టేసిన పోలీసులు!
- తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
- కిడ్నాప్‌నకు పాల్పడిన బాలుడి బంధువు
- పోలీసులకు భయపడి బాలుడిని వదిలి పరార్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ముబారక్‌కు వచ్చిన ఫోన్ నంబరు సిగ్నల్ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. విషయం పోలీసులకు చేరిందని తెలుసుకున్న కిడ్నాపర్ వంగనూరు క్రాస్‌రోడ్డు వద్ద బాలుడిని వదిలి పరారయ్యాడు. అక్కడ ఏడుస్తున్న బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అదే గ్రామానికి చెందిన ముబారక్ బంధువైన సులైమాన్ (30) బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణ తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు.