Budda Venkanna: సోనియాగాంధీకి జగన్ వెన్నుపోటు పొడిచి 9 ఏళ్ల 5 నెలల 11 రోజులు: బుద్దా వెంకన్న

Buddha Venkanna reacts sharply in Twitter after Vijayasai Reddy comments
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 23 ఏళ్లయిందన్న విజయసాయి
  • తండ్రికి, కొడుక్కి కాంగ్రెస్ రాజకీయభిక్ష పెట్టిందన్న బుద్ధా
  • వైఎస్ ను సోనియా ముఖ్యమంత్రిని చేశారని వెల్లడి
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 23 ఏళ్లయింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రికి, కొడుక్కి కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ ను ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీకి జగన్ వెన్నుపోటు పొడిచి 9 ఏళ్ల 5 నెలల 11 రోజులు అయిందని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ కు విజయసాయిరెడ్డిని, వైసీపీ పార్టీని ట్యాగ్ చేశారు.

అంతేకాదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది వైఎస్ చివరి కోరిక అని జగనే స్వయంగా చెప్పారని, ఆ విధంగా తండ్రి ఆశయానికి కూడా  వెన్నుపోటు పొడిచిన తనయుడు అనిపించుకున్నారని విమర్శించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Budda Venkanna
Jagan
Sonia Gandhi
Congress
YSR
Vijay Sai Reddy

More Telugu News