Jagan: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన సీఎం జగన్

CM Jagan talks with Late Edma Kishtareddy family members
  • కొన్నిరోజుల కిందట ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత
  • కిష్టారెడ్డి కుమారుడు సత్యంకు ఫోన్ చేసిన సీఎం జగన్
  • ధైర్యంగా ముందుకు సాగాలంటూ సూచన

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కొన్నిరోజుల కిందట అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. కిష్టారెడ్డి కుమారుడు సత్యంకు ఫోన్ చేసిన సీఎం జగన్ నిబ్బరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని తెలిపారు. ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు.

  • Loading...

More Telugu News