Raghurama Krishnaraju: సీఎం జగన్ నిర్ణయాలపై కేంద్రానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishnaraju writes Centre and ask to stop constructions in historical places
  • కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ కు భూమిపూజ
  • అది చారిత్రక ప్రదేశమన్న రఘురామ
  • నిర్మాణాలు ఆపేలా ఆదేశాలివ్వాలంటూ లేఖలో విజ్ఞప్తి
ఏపీ సర్కారు విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని, ఆ నిర్మాణాలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి లేఖ రాశారు. తొట్లకొండ బౌద్ధారామం ఉన్న కాపులుప్పాడ ప్రాంతంలో వీఐపీ అతిధి గృహం నిర్మాణానికి భూమిపూజ చేశారని వెల్లడించారు. తొట్లకొండను 1978లో చారిత్రక ప్రదేశంగా పేర్కొన్నారని, బఫర్ జోన్ కు 300 మీటర్ల దూరంలో రక్షితప్రాంతంగా గుర్తించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ సర్కారు కేంద్రం నిబంధనలను అతిక్రమిస్తోందని, చారిత్రక ప్రాంతాల్లో నిర్మాణాలు వెంటనే ఆపాలని కేంద్ర సాంస్కృతిక శాఖకు రాసిన తన లేఖలో కోరారు.
Raghurama Krishnaraju
Centre
Jagan
Historical Places
Constructions
Kapuluppada
Visakhapatnam

More Telugu News