Nagarjuna: పూరి జగన్నాథ్ తో మరోసారి నాగార్జున

  • గతంలో పూరితో 'శివమణి', 'సూపర్' చిత్రాలు 
  • పూరి కథకు తాజాగా ఓకే చెప్పిన నాగార్జున
  • మరోపక్క 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగ్     
Puri Jagannath to direct Nagarjuna again

మొదటి నుంచీ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ.. డిఫరెంట్ దర్శకులతో సినిమాలు చేస్తూ వస్తున్న అక్కినేని నాగార్జున.. నేటి తరం హీరోల దూకుడులో కూడా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఓపక్క యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూనే, మరోపక్క సీనియర్ దర్శకులతో కూడా తన చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో తనతో 'శివమణి', 'సూపర్' చిత్రాలను రూపొందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల నాగార్జున, పూరి మధ్య చర్చలు జరిగాయట. పూరి ఇప్పటికే ఆయన కోసం ఓ కథను సిద్ధం చేశాడని, త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కచ్చని అంటున్నారు. ఇదిలావుంచితే, ప్రస్తుతం సాల్మోన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగార్జున మరోపక్క ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి కూడా ఓకే చెప్పారు.      

More Telugu News