'వైసీపీ నేతలు ఇలా దోచుకుంటున్నారు'.. అంటూ వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ

devineni uma shares a video
  • ఇంటి స్థలాల పేరుతో దోపిడీ
  • జేబులు నింపుకుంటున్న వైసీపీ నేతలు
  • ఒక్క ఆవలోనే ఐదు వందల కోట్లు మెక్కేశారు
  • మైలవరం, ఆవలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల దోపిడీ
ఇంటి స్థలాల పేరుతో వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు భూముల కొనుగోళ్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని తెలుపుతూ ఇందుకు సంబంధించిన పలు వీడియో క్లిప్‌లను ఒకచోట చేర్చి టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పోస్ట్ చేశారు.

'ఇంటిస్థలాల పేరుతో భారీ కుంభకోణం, జేబులు నింపుకుంటున్న వైసీపీ నేతలు, ఒక్క ఆవలోనే ఐదు వందల కోట్లు మెక్కేశారు, మైలవరం, ఆవలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల దోపిడీ. భూముల కొనుగోలు, మెరక పేరుతో మీ ప్రజాప్రతినిధుల వారి బంధువుల దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పండి వైఎస్‌ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP
Viral Videos

More Telugu News