కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్ చెలరేగిపోతున్నారు: రేవంత్ రెడ్డి ధ్వజం
- కాపలా ఉండాల్సిన కేసీఆర్ దొంగలా మారారని వ్యాఖ్యలు
- ఏపీ ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్లు అందుతున్నాయని ఆరోపణలు
- దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని ఆగ్రహం
కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్ చెలరేగిపోతున్నారని, ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ని చేర్చకపోతే కోర్టుకు వెళతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనడానికి కేసీఆర్ ప్రణాళికలు రచించారని ఆరోపించారు.