Raghu Ramakrishna Raju: అమరావతిలో పర్యటించాలనుకుంటున్నా.. అనుమతి ఇవ్వండి: డీజీపీకి రఘురామకృష్ణరాజు లేఖ  

YSRCP MP Raghu Ramakrishna Raju writes letter to DGP seeking permission for his Amaravati visit
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తాను పర్యటించాలనుకుంటున్నానని... పర్యటనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తాను అమరావతిలో పర్యటిస్తానని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యటిస్తానని చెప్పారు.

మరోవైపు రఘురాజు సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రైతులకు ఆయన బహిరంగంగానే సంఘీభావం ప్రకటిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులకు కోర్టుల్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, రఘురాజు విన్నపంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Go Back to Shorts
Raghu Ramakrishna Raju
YSRCP
Amaravati

More Telugu News