జనసేనను భగవంతుడే కాపాడాలి!: అంబటి వ్యాఖ్యలు

17-08-2020 Mon 21:12
  • హైదరాబాదులో జెండా ఎగురవేసిన బాబు, పవన్
  • వీళ్లకు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడే హక్కుందా? అన్న అంబటి
  • ట్విట్టర్ లో ఘాటు పదజాలంతో అంబటికి రిప్లయ్ లు
  • అసభ్య పదజాలంతో స్పందించారని అంబటి వెల్లడి
Ambati Rambabu tweets god save Janasena
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హైదరాబాదులో జరుపుకోవడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దీనిపై జనసైనికులు ఘాటైన పదజాలంతో స్పందించడం పట్ల అంబటి మరో ట్వీట్ చేశారు.

తన ట్వీట్ కు జనసైనికులు భారీగా స్పందించారని, అయితే గౌరవప్రదంగా, లాజిక్ తో స్పందించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అదే సమయంలో అసభ్య పదజాలంతో, అసహనంతో స్పందించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వివరించారు. ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంత కాలం జనసేనను భగవంతుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.