Naga Chaitanya: మొక్కలు నాటి రకుల్ ప్రీత్ ను నామినేట్ చేసిన నాగచైతన్య

Naga Chaitanya participates in Green India Challenge and further nominated Rakul Preet
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న చైతూ
  • చైతూను నామినేట్ చేసిన నందినీ రెడ్డి
  • ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించిన చైతూ
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దూసుకుపోతోంది. పర్యావరణ సంక్షేమం కోసం మొక్కలు నాటడంలో సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. తనను ఈ చాలెంజ్ కు నామినేట్ చేసిన దర్శకురాలు నందినీ రెడ్డికి చైతూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, అందాలతార రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు విక్రమ్ కె కుమార్, నటుడు సుశాంత్, దర్శకుడు శివ నిర్వాణలను నామినేట్ చేశారు. ఎంతో అర్థవంతమైన కార్యక్రమం ప్రారంభించారంటూ ఎంపీ సంతోష్ ను అభినందించారు.
Naga Chaitanya
Green India Challenge
Rakul Preet Singh
Nandini Reddy
Santosh Kumar

More Telugu News