మహేశ్ బాబు సినిమాకి అమెరికా షెడ్యూలు?
- బ్యాంకు స్కాముల కథతో 'సర్కారు వారి పాట'
- మహేశ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్
- నవంబర్ మొదటి వారంలో అమెరికాలో షూటింగ్
ఇదే ఇతివృత్తాన్ని మహేశ్ బాబు నటించే తదుపరి చిత్రానికి కథావస్తువుగా ఎంచుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'సర్కారు వారి పాట'. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
ఆమధ్య లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూలు నవంబర్ నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందని అంటున్నారు. కథ ప్రకారం కొంత షూటింగును విదేశాలలో చేయాలట. అందుకే, తొలి షెడ్యూలును ఒక నెలరోజుల పాటు అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కరోనా పరిస్థితులు కుదుటపడడాన్ని బట్టి అమెరికా షెడ్యూలును నిర్వహిస్తారు.