Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

Netizens faults Aamir  Khan for meeting with Turkey first lady
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.

ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Aamir Khan
Turkey
Bollywood
Emine Erdogan

More Telugu News