Devineni Uma: పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు: దేవినేని ఉమ

Devineni Uma slams Jagan government on ration rice door delivery
  • వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన ఉమ
  • బియ్యాన్ని బొక్కేస్తున్నారంటూ విమర్శలు
  • పేదల పొట్ట కొడుతున్నారంటూ ఆగ్రహం
రేషన్ బియ్యం అంశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారని విమర్శించారు. ఇంటింటికీ డోర్ డెలివరీ ఇస్తామని చెప్పి పక్క రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి పొట్టకొట్టి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యం దోపిడీలో మీ పార్టీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. 'బొక్కేస్తున్నారు' అంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఉమ తన ట్వీట్ తో పాటు పంచుకున్నారు.
Devineni Uma
Jagan
Ration Rice
Door Delivery
YSRCP
Andhra Pradesh

More Telugu News