స్పోర్ట్స్ కాంప్లెక్స్ భూమిని వేరే అవసరాల కోసం వినియోగించడం మానుకోవాలి: వర్ల రామయ్య

Varla Ramaiah wants sports complex must be constructed at Aaganampadu
  • విశాఖ ఆగనంపాడులో క్రీడాప్రాంగణం కోసం భూమి కేటాయింపు
  • స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాత్రమే నిర్మించాలన్న వర్ల
  • సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్
టీడీపీ నేత వర్ల రామయ్య సీఎం జగన్ ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. యువతకు ఉపయోగపడే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం విశాఖలోని ఆగనంపాడులో 80 ఎకరాల భూమిని కేటాయించారని, కానీ ఆ భూమిని ఇతర అవసరాల కోసం వినియోగించాలని భావిస్తున్నారని, ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలని వర్ల రామయ్య స్పష్టం చేశారు. యువతను ఉత్తమశ్రేణి క్రీడాకారులుగా తయారు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మాత్రమే అక్కడ నిర్మించాలని హితవు పలికారు.
Go Back to Shorts
Varla Ramaiah
Jagan
Sports Complex
Aaganampadu
Vizag

More Telugu News