మనదేశంలో కరోనా వైరస్ 73 రకాలుగా మార్పు చెందిందా..?
- కరోనా వైరస్ లో రెండు జాతులు గుర్తింపు
- భారత్ వాతావరణంలో అనేక ఉత్పరివర్తనాలకు లోనైందని వెల్లడి
- కరోనా బలహీనత తెలిస్తే విరుగుడు సులభం అంటున్న పరిశోధకులు
ప్రధాన వైరస్ నుంచి అనేక రకాలుగా కరోనా ఉత్పరివర్తనాలు ఏర్పడ్డాయని, కరోనా బలహీనత గురించి పూర్తిగా తెలుసుకుంటే చికిత్స ఎంతో సులభతరం అవుతుందని, దానికి వ్యాక్సిన్ రూపొందించడం ఏమంత కష్టసాధ్యం కాబోదని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ జయశంకర్ దాస్ తెలిపారు. తమ అధ్యయనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్ లైన్ లో ఉంచామని ఆయన వెల్లడించారు.
ఒడిశా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం సీఎస్ఐఆర్, ఐజీఐబీ, న్యూఢిల్లీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్ కు చెందిన ఎస్ యూఎం పరిశోధకులతో కలిసి పనిచేశారు.