Laser Weapon: ప్రధాని ప్రసంగం సందర్భంగా లేజర్ ఆయుధాన్ని మోహరించిన రక్షణ శాఖ

Andi drone laser system deployed during PM Modi speech at Redfort
షార్ట్స్‌లో చూడండి
ఇవాళ 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ యావత్ భారతావనిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ కోసం సరికొత్త లేజర్ ఆయుధ వ్యవస్థను మోహరించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ యాంటీ డ్రోన్ లేజర్ వ్యవస్థ ప్రధానంగా ఆకాశంలో తిరుగాడే డ్రోన్లను వెంటనే పసిగడుతుంది. అవసరమైతే వాటిని కూల్చివేయగలదు. 3 కిలోమీటర్ల పరిధిలో సూక్ష్మ పరిణామంలో ఉన్న డ్రోన్లను కూడా ఇది నిర్వీర్యం చేయగలదు. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో డ్రోన్ల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈసారి ప్రధాని రక్షణ కోసం ఈ లేజర్ గన్ ను కూడా భద్రతా చర్యల కోసం వినియోగించారు.
Go Back to Shorts
Laser Weapon
Anti Drone
Narendra Modi
DRDO
Redfort
Independence Day

More Telugu News