ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కమల హారిస్ దోసె వీడియో
- అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న కమల
- డెమొక్రాట్ల తరఫున బరిలో దిగిన భారత సంతతి మహిళ
- ట్రంప్ వ్యాఖ్యలతో మరింత ప్రచారం పొందుతున్న కమలా
గతేడాది, భారత సంతతి అమెరికా టెలివిజన్ నటీమణి వెరా కిండీ కాలింగ్ తో కలిసి కమలా హారిస్ ఓ షోలో సందడి చేశారు. మసాలా దోసె వేయడంలో కిండీ కాలింగ్ కు సహకరించారు. ఈ సందర్భంగా ఆమె తనదైన శైలిలో మాట్లాడి వీక్షకులను అలరించారు. ఇప్పుడామె అమెరికా ఉపాధ్యక్ష పదవికి రేసులో ఉండడంతో ఈ దోసె వీడియో బాగా సర్క్యులేట్ అవుతోంది.