కేంద్రమంత్రి యశోనాయక్ కు లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్

Central minister Shripad Y Naik tested corona positive
  • మహమ్మారి వైరస్ బారినపడిన మరో కేంద్రమంత్రి
  • హోం ఐసోలేషన్ లో ఉన్న యశోనాయక్
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
కరోనా బారినపడిన కేంద్రమంత్రుల జాబితాలో శ్రీపాద్ యశోనాయక్ కూడా చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇవాళ కరోనా టెస్టులు చేయించుకున్నానని, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు. కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని యశోనాయక్ పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో, గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.
Go Back to Shorts
Shripad Y Naik
Corona Virus
Positive
Central Minister

More Telugu News