కశ్మీర్ పై మీరేం మాట్లాడరేంటని నిలదీసిన పాక్... రుణం, చమురు సరఫరా నిలిపివేసిన సౌదీ!
- కశ్మీర్ పై సౌదీని రెచ్చగొట్టాలనుకున్న పాక్ పన్నాగాలు విఫలం
- పాక్ బెదిరింపు స్వరాన్ని తీవ్రంగా పరిగణించిన సౌదీ
- ఇచ్చిన అప్పులో బిలియన్ డాలర్ల వసూలు
అయితే, ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను నిర్మొహమాటంగా వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో, 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్ కు దూరం కానుంది. ఇటీవల ఒప్పందం ముగిసినా మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, పాక్ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న సౌదీ ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకుంది. దాంతో పాక్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.