ఐర్లాండ్ నుంచి వచ్చిన అలెర్ట్ ఫోన్... ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడిని కాపాడిన ముంబై పోలీసులు!

Police Saves Youth after Call from Irland
  • ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన యువకుడు
  • దాన్ని చూసి స్పందించిన ఐర్లాండ్ అధికారి
  • ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్న సైబర్ సెల్
ఐర్లాండ్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్, ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ యువకుడి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే, ముంబైలో వంటవాడిగా పనిచేస్తున్న ఓ ఢిల్లీ యువకుడు, తాను జీవితంపై విరక్తి చెందానని, ఆత్మహత్య చేసుకోనున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆ వెంటనే ఈ పోస్ట్ ఐర్లాండ్ లో ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఓ అధికారి కంట కనపడింది. వెంటనే స్పందించిన అతను, ఢిల్లీ పోలీసులకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మెయిల్ ద్వారానూ తెలియజేశారు.

వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్ అధికారులు, టెక్నాలజీ సాయంతో ఆ యువకుడి ఫేస్ బుక్ ఖాతాను ట్రేస్ చేసి, ఫోన్ నంబర్ ను కనిపెట్టారు. అతను ముంబైలో ఉన్నాడని పసిగట్టి, అక్కడి పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఆ వెంటనే అతనున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని సైబర్ సెల్ డీసీపీ అనేశ్ రాయ్ తెలియజేశారు.
Go Back to Shorts
Facebook
Sucide
Cyber Crime
Police
Irland

More Telugu News