అయోధ్య రామాలయంలో రెండు టన్నులకు పైగా బరువైన భారీ గంట!
Add ap7am to your home Screen

అయోధ్య రామాలయంలో రెండు టన్నులకు పైగా బరువైన భారీ గంట!

Above Two Tones Weight Bell for Ayodhya Ram Mandir
  • రూ. 21 లక్షలతో సిద్ధం చేస్తున్న దయాల్ ఫ్యామిలీ
  • తయారీలో నిమగ్నమైన ముస్లిం కార్మికులు
  • భారీ గంటకు తుదిమెరుగులు
అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో 2.1 టన్నుల బరువుండే భారీ గంట ప్రధాన ఆకర్షణ కానుంది. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో ఈ గంటను దావూ దయాల్ అనే హిందూ ఫ్యామిలీ సిద్ధం చేస్తోంది. ఈ గంటను నైపుణ్యవంతులైన ముస్లిం కార్మికులు తయారు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.

 బంగారం, వెండి, రాగి, సీసం, పాదరసం, ఇనుము తదితర అష్టధాతువులతో దీన్ని తయారు చేస్తున్నామని , ఈ గంటలో ఎటువంటి అతుకులు ఉండవని, ఇదే దీని ప్రత్యేకతని దయాల్ వెల్లడించారు. గతంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి టన్ను బరువైన గంటను తయారు చేశామని, ఆ అనుభవంతోనే ఇప్పుడు దీని తయారీకి సిద్ధమయ్యామని వెల్లడించారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షలు ఖర్చవుతుందని, 25 మంది నిపుణులు, నాలుగు నెలల పాటు శ్రమించాలని అన్నారు.
Ayodhya Ram Mandir
Bell
2 Tonnes

More Telugu News