కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!
- 2.40 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
- ఈ సీజన్ లో అత్యధిక వరద
- ఈ నెలలోనే సాగర్, శ్రీశైలం నిండే అవకాశాలు
ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 40,259 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయంలో 855.90 అడుగుల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తిగా నిండాలంటే ఇంకో 121 టీఎంసీల నీరు అవసరం. ఇదే సమయంలో నాగార్జున సాగర్ లో 559.40 అడుగులకు నీటి మట్టం చేరుకోగా, 230.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తిగా నిండాలంటే, మరో 82 టీఎంసీల నీరు అవసరం. ఎగువన వర్షాలు కురుస్తూనే ఉండటంతో ఈ వరద మరింత కాలం పాటు కొనసాగుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు నెలలోనే డ్యాములు నిండిపోతాయని అంచనా.