ఓటమి ఎరుగని నేత.. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి
- నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం
- టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎల్లయ్య
ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్యకు గుర్తింపు ఉంది. సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 16వ లోక్ సభకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు.