అల్లాహ్ నాకు ఆ అధికారమే ఇస్తే... : షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు
- అల్లాహ్ అధికారం ఇస్తే ఆర్మీ బడ్జెట్ పెంచుతా
- గడ్డి తినైనా సరే ఆ పని చేస్తా
- నాతో చర్చించాలని ఆర్మీ చీఫ్ ను కోరతా
'అల్లాహ్ నాకు అధికారం ఇస్తే... గడ్డి తినైనా సరే నా దేశ ఆర్మీ బడ్జెట్ ను పెంచుతా' అని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ ఆర్మీతో కలిసి దేశ సివిల్ సెక్టార్ ఎందుకు కలిసి పనిచేయదో తనకు అర్థం కాదని చెప్పాడు. తనతో కూర్చుని, చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోవాలని ఆర్మీ చీఫ్ ను కోరతానని తెలిపాడు. ఒకవేళ ఆర్మీ బడ్జెట్ 20 శాతంగా ఉంటే.. దాన్ని తాను 60 శాతం చేస్తానని చెప్పాడు. మనమంతా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే... చివరకు మనమే నష్టపోతామని తెలిపాడు.