Maharashtra: కరోనా నుంచి కోలుకున్న నాలుగు రోజులకే కన్నుమూసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్

Former Maharashtra CM Shivajirao Patil passes away in Pune
  • గత నెలలో కరోనా బారినపడిన మాజీ సీఎం
  • పూణె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న వైనం
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నీలంగేకర్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. 91 ఏళ్ల శివాజీరావు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. గత నెలలో కరోనా బారినపడిన ఆయన పూణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని ఫలితాలు రావడంతో డిశ్చార్జ్ చేశారు. కాగా, కిడ్నీ సంబంధిత సమస్యల వల్లే ఆయన కన్నుమూసినట్టు శివాజీరావు కుటుంబ సన్నిహితులు తెలిపారు. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శివాజీరావు 3 జూన్ 1985 నుంచి 6 మార్చి 1986 వరకు కొద్దికాలంపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆయన నీలంగ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1962 నుంచి ఏడుసార్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నారు.
Maharashtra
Shivajirao Patil
passes away
Corona Virus

More Telugu News