Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ.. భద్రాద్రిలో ప్రత్యేక పూజలు

special pujas at Bhadrachalam Ram temple
  • మరికాసేపట్లో అయోధ్యలో భూమిపూజ
  • ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణ పనులు పూర్తికావాలంటూ ప్రత్యేక పూజలు
  • బేడా మండపంలో హోమం
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరికాసేపట్లో భూమి పూజ జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటూ స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో నెయ్యి, సమిధలు సమర్పించి హోమం నిర్వహించారు.
Ayodhya Ram Mandir
Bhadrachalam
Ram Temple
Telangana

More Telugu News