Narendra Modi: అయోధ్య చేరుకుని.. హనుమాన్ గఢీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

modi arrives ayodhya
  • మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం 
  • మోదీ వెంటే అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ పర్యటన
  • కాసేపట్లో భూమిపూజ ప్రదేశానికి మోదీ
  • ఇప్పటికే అక్కడకు చేరుకున్న పలువురు స్వామీజీలు
కోట్లాది మంది హిందువుల శతాబ్దాల నాటి కల అయిన 'అయోధ్యలో రామ మందిర నిర్మాణం' కోసం భూమిపూజ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.

అనంతరం హనుమాన్ గఢీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. హనుమను దర్శించుకున్న అనంతరం రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. ఆ తర్వాత మోదీ పారిజాత మొక్కను నాటారు.

కాసేపట్లో స్వామీజీలతో కలిసి మోదీ భూమిపూజలో పాల్గొననున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పటికే రామ్‌దేవ్ బాబా, స్వామి అవ‌దేశానంద గిరి, స్వామి చిదానంద స‌ర‌స్వ‌తితో పాటు  పలువురు స్వామీజీలు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 మధ్య భూమిపూజ జరగనుంది.
Narendra Modi
Ayodhya Ram Mandir
Uttar Pradesh

More Telugu News