ఎల్జీ పాలిమర్స్ కేసు: నిందితులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

High Court gives conditional bail in LG Polymer issue
షార్ట్స్‌లో చూడండి
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నిందితులకు ఊరట కలిగింది. ఈ కేసులో 12 మంది నిందితులకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందినవారిలో దక్షిణ కొరియాకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ కేసులో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ, డైరెక్టర్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీకై 14 మంది మృత్యువాత పడడం తెలిసిందే. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి, కేసు పెట్టిన సంగతి విదితమే.
Go Back to Shorts
LG Polymers
Bail
AP High Court
Vizag Gas Leak
South Korea

More Telugu News