Swami Swaroopanandendra: ఇక్కడ మోగే గుడిగంటలే అయోధ్యలో మంగళవాయిద్యాలు కావాలి: స్వామి స్వరూపానందేంద్ర

Swami Swaroopanandendra calls Telugu people to ring temple bells during Bhumi Poojan at Ayodhya
  • రేపు అయోధ్యలో రామ మందిరం భూమి పూజ
  • తెలుగు రాష్ట్రాల్లో గుడిగంటలు మోగించాలన్న స్వరూపానందేంద్ర
  • మందిరం నిర్మాణాన్ని దేశమంతా ఆస్వాదించాలని పిలుపు
అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేసే చారిత్రాత్మక కార్యక్రమం రేపు జరగనుంది. ఈ భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, అయోధ్యకు పూర్వవైభవం తీసుకొచ్చే కృషి అభినందనీయం అన్నారు. భారతీయ చరిత్రలో ఆగస్టు 5 ఓ సుదినం అని పేర్కొన్నారు.

రామ మందిరం నిర్మాణాన్ని భారతీయులంతా ఆస్వాదించాలని, అయోధ్యలో భూమి పూజ సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో గంటలు మోగించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మోగే గుడిగంటలే అయోధ్యలో మంగళవాయిద్యాలు కావాలని స్వరూపానందేంద్ర ఆకాంక్షించారు. ప్రస్తుతం స్వరూపానందేంద్ర ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ లో చాతుర్మాస్య దీక్ష ఆచరిస్తున్నారు. రామ మందిరం భూమి పూజకు రావాలంటూ తనకు ఆహ్వానం అందినా, దీక్ష కారణంగా రాలేకపోతున్నానని, తర్వాత మరోసారి అయోధ్య వెళతానని తెలిపారు.
Swami Swaroopanandendra
Bhumi Poojan
Ayodhya Ram Mandir
Andhra Pradesh
Telangana

More Telugu News