Suresh Babu: రానా పెళ్లి వేడుకతో ఎవరి ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేం: డి.సురేశ్ బాబు

Suresh Babu said they can not put others health into risk in the account of Rana marriage
  • ఈ నెల 8న రానా, మిహికా పెళ్లి
  • రామానాయుడు స్టూడియోలో వివాహ వేడుక
  • అతిథులకు కరోనా టెస్టులు తప్పనిసరన్న సురేశ్ బాబు
టాలీవుడ్ నటుడు రానా, మిహికా బజాజ్ ల వివాహం ఈ నెల 8న జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రానా పెళ్లి వేడుక కొద్దిమందితోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ, రోకా వేడుక నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహం కూడా జరుగుతుందని వెల్లడించారు.

ఈ పెళ్లికి 30 లోపు మందినే పిలుస్తున్నామని, తమ కుటుంబ సభ్యులు మినహా అతి కొద్దిమంది అతిథులే వస్తారని వివరించారు. టాలీవుడ్ ప్రముఖులను కూడా పిలవడంలేదని, రానా పెళ్లి వేడుకతో వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని సురేశ్ బాబు పేర్కొన్నారు. ఈ పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు తప్పనిసరి అని, భౌతికదూరం అమలు చేస్తామని వివరించారు. రానా పెళ్లి వేడుక చిన్నదే అయినా, అందమైన కార్యక్రమం అని అభివర్ణించారు.
Suresh Babu
Rana
Miheeka Bajaj
Wedding
Corona Virus
Hyderabad
Tollywood

More Telugu News