Pragyan Rover: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ కదలికలు... నాసా ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నది నిజమేనా?

  • నాడు ఆఖరి నిమిషంలో విఫలమైన చంద్రయాన్-2
  • కూలిపోయిన విక్రమ్ ల్యాండర్
  • విక్రమ్ శకలాలను గుర్తించిన టెక్కీ షణ్ముగ సుబ్రమణియన్
  • ప్రజ్ఞాన్ రోవర్ ను గుర్తించానంటూ మళ్లీ తెరపైకి వచ్చిన టెక్కీ
Pragyan rover may intact on moon surface according to NASA latest sat images

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. స్థిరంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకాల్సిన విక్రమ్ ల్యాండర్ బలంగా గుద్దుకోవడంతో సంకేతాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ శకలాలను షణ్ముగ సుబ్రమణియన్ అనే టెక్కీ నాసా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. ఇప్పుడా షణ్ముగ సుబ్రమణియన్ మరోసారి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.

విక్రమ్ ల్యాండర్ లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై కొంత మేర కదిలినట్టు నాసా తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని వివరించారు. విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్టుగా భావిస్తున్న బిలం నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని మీటర్లు ముందుకు కదిలినట్టు నాసా చిత్రాల్లో కనిపిస్తోంది. దీనిపై ఇస్రో చైర్మన్ కె.శివన్ స్పందించారు.

"దీనిపై నాసా ఇంతవరకు ఎలాంటి సమాచారం అందించలేదు. కానీ విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన ఈ వ్యక్తి నుంచి మాకు ప్రజ్ఞాన్ రోవర్ గురించి తాజాగా ఈమెయిల్ సమాచారం వచ్చింది. మా నిపుణులు ఆ ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాని గురించి ఏమీ చెప్పలేం" అని తెలిపారు.

More Telugu News