Governor: కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన తమిళనాడు గవర్నర్

Tamilandu governor Bhanwarilal Purohit hospitalised due to corona like symptoms
  • ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం
  • 84 మందికి పాజిటివ్
  • జూలై 29 నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్న గవర్నర్
కరోనా మహమ్మారి విజృంభణ తమిళనాడులో కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. గవర్నర్ భన్వరిలాల్ జూలై 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు.

ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్టు అర్థమవుతోంది.
Governor
Tamilnadu
Bhanwarilal
Corona Virus
Symptoms

More Telugu News