Sonia Gandhi: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా

Congress chief Sonia Gandhi discharged from hospital
  • గత గురువారం ఆసుపత్రిలో చేరిన సోనియా
  • సాధారణ వైద్య పరీక్షల కోసమేనన్న ఆసుపత్రి వర్గాలు
  • ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గత గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న సోనియా ఇవాళ తన నివాసానికి వెళ్లారు. సోనియా సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ బులెటిన్ వెలువరించాయి.
Sonia Gandhi
Discharge
Hospital
Health Checkup
New Delhi
Congress

More Telugu News