Visakhapatnam District: షిప్‌యార్డ్ ప్రమాదంలో మృతి చెందిన కొడుకు.. చూసేందుకు వస్తూ ముగ్గురి మృతి

Three dead in a road accident in srikakulam dist
  • ఖరగ్‌పూర్ నుంచి స్కార్పియో వాహనంలో వస్తున్న కుటుంబం
  • శ్రీకాకుళం జిల్లా జలంత్ర కోట జంక్షన్ వద్ద ఆగి వున్న లారీని ఢీకొట్టిన వైనం
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
విశాఖపట్టణంలోని షిప్‌యార్డ్‌లో నిన్న జరిగిన క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన కుమారుడిని చూసేందుకు వస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జలంత్ర కోట జంక్షన్ వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారు. మృతులను బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వాసులుగా గుర్తించారు. స్కార్పియో వాహనంలో వీరు విశాఖపట్టణం వెళ్తుండగా ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వాసులుగా గుర్తించారు. నిన్న విశాఖ షిప్‌యార్డ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన తమ కుమారుడిని చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Visakhapatnam District
crane accident
kharagpur
Road Accident
Srikakulam District

More Telugu News