Corona Virus: అనంతపురంలో విషాదం.. కరోనా బాధిత భార్యాభర్తలు ఆత్మహత్య
- ఇటీవల కరోనా బారినపడిన దంపతులు
- భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు
- వారం రోజలు వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఫణిరాజ్(42), శిరీష (40)లు భార్యాభర్తలు. ఇటీవల వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వారం రోజుల క్రితం ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందింది. కాగా, ఫణిరాజ్, శిరీష మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవి మరింత ముదరడంతో నిన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారం రోజుల వ్యవధిలో మరణించడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.