Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లోకి కారుతో దూసుకెళ్లి హల్‌చల్ చేసిన ముగ్గురి అరెస్టు ‌

police arrest 3 in jalpally case
  • నిన్న రాత్రి జల్‌పల్లిలో ఘటన
  • సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా గాలింపు
  • నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులు
  • కాల్‌డేటాను పరిశీలిస్తోన్న పోలీసులు
హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లిలో సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి నిన్న రాత్రి ఇన్నోవా కారుతో దూసుకెళ్లిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాగా, నిన్న రాత్రి  మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆ నలుగురు యువకులు ‘మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

Mohan Babu
Tollywood
Cricket
Hyderabad Police

More Telugu News