Hardhik Pandya: కొడుకు ఫొటోను షేర్ చేసిన పాండ్యా.. విపరీతంగా వైరల్ అవుతున్న ఫొటోను చూడండి!

Hardhik Pandya Shares picture of his son
  • బుధవారం నాడు తండ్రిగా ప్రమోషన్ పొందిన పాండ్యా
  • కొడుకును ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన ఆల్ రౌండర్
  • గంటల వ్యవధిలో 24 లక్షలకు పైగా లైకులు
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పుత్రోత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే. అతని భార్య నటాషా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం నాడు తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హార్దిక్ ప్రకటించాడు. చిన్నారి చేతిని తాను పట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. ముఖం మాత్రం చూపించలేదు. తాజాగా ఈరోజు తన కుమారుడిని అందరికీ చూపించాడు. కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోను షేర్ చేశాడు. డెలివరీ రూమ్ లో ఈ ఫొటోను తీసినట్టు కనిపిస్తోంది. కొడుకుని చూసిన ఆనందంలో హార్ధిక్ ముఖం వెలిగిపోతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫొటోను షేర్ చేసిన గంటల వ్యవధిలోనే 24 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
Hardhik Pandya
Son
Photo
Team India

More Telugu News