Jagan: మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి... అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు

CM Jagan saddened to the demise of former minister Pydikondala Manikyalarao
  • కరోనాతో కన్నుమూసిన మాణిక్యాలరావు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం జగన్
  • శోకసంద్రంలా తాడేపల్లిగూడెం!
బీజేపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదిగి దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా చేపట్టిన సీనియర్ రాజకీయవేత్త మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూయడం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాణిక్యాలరావు 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడాయన మృతితో స్వస్థలం తాడేపల్లిగూడెం మూగబోయింది.
Jagan
Pydikondala Manikyalarao
Death
Corona Virus
BJP
Andhra Pradesh

More Telugu News