Jagan: హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా

CM Jagan asks officials how the crane accident occurred at Hindusthan Ship Yard
  • విశాఖలో కుప్పకూలిన క్రేన్
  • 10కి పెరిగిన మృతుల సంఖ్య
  • తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సీఎం ఆదేశం
విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. మరణాలు సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం, ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ లను ఆదేశించారు.  అటు, మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా షిప్ యార్డు ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలంటూ ఆర్డీవోకు స్పష్టం చేశారు.
Jagan
Crane Accident
Hindusthan Ship Yard
Visakhapatnam

More Telugu News