Varla Ramaiah: విశాఖ పోలీస్ కమిటీలో క్షేత్రస్థాయి అధికారులకు స్థానం కల్పించకపోతే ఎలా?: వర్ల రామయ్య

Varla Ramaiah questions CM Jagan on police committee in Vizag
  • విశాఖ పోలీసు వ్యవస్థ బలోపేతానికి కమిటీ
  • సీనియర్ అధికారులకే స్థానం కల్పించారన్న వర్ల
  • గతంలో క్షేత్రస్థాయి అధికారులకూ స్థానం ఉండేదని వెల్లడి
విశాఖలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వేసిన కమిటీలో దిగువస్థాయి అధికారులకు స్థానం కల్పించలేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. సీఎం గారూ, విశాఖ పోలీస్ కమిటీలో అందరూ సీనియర్ అధికారులే ఉన్నారు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు స్థానం కల్పించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. అందరూ ఉన్నతాధికారులే ఉంటే ఆ కమిటీ నివేదిక ఎలా ఉంటుందో? అంటూ సందేహం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి కమిటీల్లో దిగువస్థాయి అధికారులు కూడా ఉండేవారని, ప్రభుత్వం ఈ అంశంపై ఓసారి ఆలోచించాలని వర్ల రామయ్య హితవు పలికారు.
Varla Ramaiah
Vizag
Police Committee
Senior Officials

More Telugu News