LK Advani: అద్వానీ, జోషిలకు అందని 'అయోధ్య' ఆహ్వానం!

Still no invitaion for Advani and MM Joshi for Ayodhya event
  • ఈ నెల 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
  • ఉమాభారతి, కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం
  • కార్యక్రమానికి హాజరుతామన్న ఉమ, కల్యాణ్ సింగ్
మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 5) అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జగనుంది. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక  పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఆహ్వానం అందలేదు. కరోనా నేపథ్యంలో వీరిద్దరి వయసు దృష్టిలో ఉంచుకుని ఆహ్వానించలేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

మరోపక్క, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉమాభారతి, కల్యాణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి తాము ఏమాత్రం చింతించమని చెప్పారు. భూమిపూజకు తాము హాజరవుతామని తెలిపారు.

మరోవైపు మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు వీడియో విచారణకు ఇటీవల అద్వానీ, జోషి, ఉమాభారతి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఉమాభారతి మాట్లాడుతూ, ఎలాంటి తీర్పు వెలువడినా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను ఉరి తీసినా సంతోషమేనని అన్నారు.
LK Advani
MM Joshi
Uma Bharathi
Ayodhya Ram Mandir

More Telugu News